YSRCP: యుద్ధం చంద్ర‌బాబుతో కాదు ఉన్మాదుల‌తో: జ‌గ‌న్

jagan viral comments on chandrababu and media organisations
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ పోరాటం చేస్తున్న‌ది ఒక్క చంద్ర‌బాబుతో కాద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుతో ఏమీ కాద‌ని, చంద్ర‌బాబు నథింగ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5ల‌తో యుద్ధం సాగిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే ఈ సంస్థ‌ల‌ను ఉన్మాదులుగా అభివ‌ర్ణించారు. వైసీపీ యుద్ధం సాగిస్తున్న‌ది ఉన్మాదుల‌తోన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌వారం నాడు అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత అసెంబ్లీ మీటింగ్ హాలులోనే జ‌రిగిన ఈ స‌మావేశంలో టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించిన జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసేలా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలో మెజారిటీ మంత్రుల‌ను కేబినెట్ నుంచి తొల‌గించ‌నున్నట్లుగా కూడా ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
YSRCP
YSRCPLP
YS Jagan

More Telugu News