అందుకే ఆ పాత్రల కోసం ఎన్టీఆర్ - చరణ్ లను ఎంచుకున్నాను: రాజమౌళి
- ఈ నెల 25వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్
- ప్రమోషన్స్ లో బిజీగా రాజమౌళి
- కథను బట్టే పాత్రలు నడుస్తాయి
- అభిమానులంతా ఆశించేలా ఉంటుందన్న రాజమౌళి
చరణ్ విషయానికి వస్తే ఆయనది సాధు స్వభావం. ఎంతటి భావావేశాన్ని అయినా ఆయన తనలో దాచుకోగలడు. అల్లూరిలోను అవే లక్షణాలు కనిపించాయి. అందువల్లనే ఆ పాత్రలో చరణ్ ను తీసుకున్నాను. ఇక ఎన్టీఆర్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. ఏ మాత్రం ఆవేశం వచ్చినా వెంటనే బయటపడిపోతాడు. కొమరం భీమ్ పాత్రకి దగ్గరగా ఉండటం వలన ఆయనను తీసుకున్నాను.
ఎన్టీఆర్ - చరణ్ పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. ఇతనికో పాట .. అతనికో ఫైటు అన్నట్టుగా నేను ఆ పాత్రలను ట్రీట్ చేయలేదు. కథను బట్టే ఆ పాత్రలు నడుస్తాయి. అభిమానుల వైపు నుంచి చూస్తూ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం మాత్రం కొంత కష్టమైంది" అని చెప్పుకొచ్చారు.