హిజాబ్ వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం పని?
- మత కలహాల కోసమే హిజాబ్ పంచాయతీ పెట్టారు
- వీటి వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందన్న కేసీఆర్
మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మత కలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. యూపీఏను ఓడించి ఎన్డీయేను గెలిపించినందుకు దేశ పరిస్థితి ఇలా తయారయిందని చెప్పారు. బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందని అన్నారు. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. పెడధోరణి దేశానికి మంచిది కాదని, దీనిపై దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని అన్నారు.