అర్ధ సెంచరీలతో అదరగొట్టిన అమిలియా, అమీ సాటెర్త్‌వైట్.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం
- ప్రపంచకప్‌లో భారత్ రెండో మ్యాచ్
- 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన కివీస్
- చివర్లో బంతితో విజృంభించిన పూజా వస్త్రాకర్
- 75 పరుగులు చేసిన అమీ సాటెర్త్‌వైట్
కెప్టెన్ సోఫీ డివైన్ (30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు) ధాటిగా ఆడగా, అమిలియా కెర్, అమీ సాటెర్త్‌వైట్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. అమిలియా 64 బంతుల్లో 50 పరుగులు చేయగా, అమీ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసింది. మేడీ గ్రీన్ 27, వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 41 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో విజృంభించగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, జులన్ గోస్వామి, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.