తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా

Telangana corona daily bulletin
  • గత 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు
  • ఇంకా 3,539 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 76 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. 

అదే సమయంలో 512 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,624 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,80,974 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,539 మంది చికిత్స పొందుతున్నారు.  
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News