సినిమా పరిశ్రమనూ వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా?: వర్ల రామయ్య
- మన రాష్ట్రంలో పేదవాడికున్న ఏకైక వినోదం సినిమా
- సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూడాలనుకుంటున్నారా?
- "ఆ" సినిమా పట్ల మీకెందుకంత వివక్ష? అని రామయ్య ప్రశ్న
'మన రాష్ట్రంలో పేదవాడికున్న ఏకైక వినోదం "సినిమా". ఆ సినిమా పరిశ్రమను కూడ వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ! సిని"మా"కు కూడా కులగజ్జి అంటించి తమాషా చూడాలనుకుంటున్నారా? "ఆ" సినిమా పట్ల మీకెందుకంత వివక్ష? రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రభుత్వమే సృష్టిస్తే ఎలా?' అని వర్ల రామయ్య నిలదీశారు.