తెలంగాణలో బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- టీఆర్ఎస్ పాలనలో బహుజనులకు తీరని అన్యాయం జరుగుతోంది
- ప్రైవేట్ యూనివర్శిటీల్లో రిజర్వేషన్లు లేకుండా చేశారు
- బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలి
ఎస్సెల్బీసీ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ. 4.25 లక్షల జీతం తీసుకుంటున్నారని... పాములు, తేళ్లతో కొట్లాడుతూ కూలి పని చేసుకునే మన గిరిజన బిడ్డలు రోజుకు రూ. 200 మాత్రమే సంపాదిస్తున్నారని అన్నారు. బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యమే రావాలని చెప్పారు.