హోదా అంశంలో కేంద్రంతో లాలూచీ పడ్డారు... అందుకే అజెండా నుంచి తొలగించారు: కనకమేడల

Kanakamedala fires on YCP Govt
  • ఈ నెల 17న ఉభయ రాష్ట్రాలతో హోంశాఖ సమావేశం
  • అజెండా నుంచి హోదా అంశం తొలగింపు
  • వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారన్న కనకమేడల
కేంద్ర హోంశాఖతో ఉభయ రాష్ట్రాల సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తొలగించడం పట్ల టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. హోదా అంశంలో వైసీపీ సర్కారు కేంద్రంతో లాలూచీపడిందని మండిపడ్డారు. అందుకే హోదా అంశాన్ని అజెండా నుంచి తప్పించారని ఆరోపించారు.

కేంద్రం మెడలు వంచైనా సరే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న వైసీపీ నేతలు, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీల బలం ఉంటే హోదా సాధిస్తామని చెప్పారు... బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని హోదా అంశాన్ని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 17న జరిగే సమావేశం అజెండాలో హోదా అంశాన్ని కూడా చేర్చించాలని కనకమేడల స్పష్టం చేశారు.
Go Back to Shorts
Kanakamedala Ravindra Kumar
YCP
AP Special Status
Agenda
Andhra Pradesh

More Telugu News