Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,679 మందికి కరోనా పాజిటివ్

AP Corona Positive Cases report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 27,522 శాంపిల్స్ పరీక్షించగా... 1,679 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 225, గుంటూరు జిల్లాలో 212 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 9,598 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,08,622 మంది కరోనా బారినపడగా, వారిలో 22,47,824 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 46,119 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,679కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Today Cases

More Telugu News