లైన్ క్లియర్ అంటూ మహేశ్ కి క్లారిటీ ఇచ్చేసిన త్రివిక్రమ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైన్ క్లియర్ అంటూ మహేశ్ కి క్లారిటీ ఇచ్చేసిన త్రివిక్రమ్!

Trivikram and Mahesh Babu movie update
  • మహేశ్ విశ్రాంతి పూర్తయినట్టే
  • వచ్చేనెల నుంచి 'సర్కారువారి పాట'కు హాజరు
  • మార్చి 2వ వారం నుంచి త్రివిక్రమ్ తో సెట్స్ పైకి
  • ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా
త్రివిక్రమ్ సినిమాలు ఎన్నిమార్లు టీవీల్లో చూసినా బోర్ అనిపించదు. కథాకథనాలను ఆయన ఆవిష్కరించే విధానమే అందుకు కారణం. ఎక్కడా కూడా ఎంటర్టైమెంట్ విషయంలో గ్యాప్ రాకుండా కథను పరిగెత్తించడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రం మహేశ్ బాబుతో రూపొందనుంది. కొంతకాలంగా త్రివిక్రమ్ అదే పనిలో ఉన్నారు.

మోకాలు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన మహేశ్, ఫిబ్రవరిలో 'సర్కారువారి పాట' సినిమా షూటింగును పూర్తి చేయనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరశురామ్ రెడీ చేసి ఉంచాడు. ఆ తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి మహేశ్ వెళ్లనున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది.

ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేయడం జరిగిపోయిందనీ, మార్చి 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి టీమ్ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి మహేశ్ కి త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేశాడట. ఇక ఆ దిశగానే మహేశ్ తన పనులు పూర్తి చేసుకోనున్నాడు. ఇది ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
Mahesh Babu
Pooja Hegde
Trivikram Movie

More Telugu News