కాంగ్రెస్ లోకి డీఎస్ చేరిక వాయిదా.. కారణం ఇదే!
- ఈరోజు కాంగ్రెస్ లో చేరాల్సిన డీఎస్
- కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కు అస్వస్థత
- గత డిసెంబర్ 16న సోనియాతో భేటీ అయిన డీఎస్
మరోవైపు ఈరోజు ఆయన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే కాంగ్రెస్ లోకి డీఎస్ చేరిక వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్ 16న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరేందుకు డీఎస్ కు సోనియా అనుమతినిచ్చారు.