ఏపీలో 13 వేలకు పైగా కరోనా రోజువారీ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- ఏపీలో భారీగా కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 44,516 కరోనా పరీక్షలు
- 13,212 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
- 64 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
అదే సమయంలో 2,942 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,53,268 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,74,600 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.