RRR: ముంబయిలో ఘనంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక... ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్

RRR pre release event in Mumbai
షార్ట్స్‌లో చూడండి
బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటించిన ఈ చిత్రం జనవరి 7న రిలీజ్ అవుతోంది. తెలుగు సహా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు చిత్ర సమర్పకుడు, ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కూడా హాజరయ్యారు. కాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న ఏపీ, తెలంగాణ నుంచి భారీగా రామ్ చరణ్ అభిమానులు తరలి వెళ్లారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ ముంబయి చేరుకున్నారు.
Go Back to Shorts
RRR
Pre Release Event
Mumbai
Salman Khan
Ramcharan
NTR
Tollywood

More Telugu News