ధోనీ కొత్త నేస్తం ఇదిగో!
- ధోనీ ఇంట కొత్త సభ్యురాలు
- మకావు చిలుకను తెచ్చుకున్న ధోనీ
- ధోనీ టీ తాగుతుండగా భుజంపై కూర్చున్న చిలుక
- చాయ్ డేట్స్ అంటూ సాక్షి సింగ్ హ్యాష్ ట్యాగ్
తాజాగా ధోనీ ఇంట కొత్త సభ్యురాలు వచ్చింది. దానికి సంబందించిన ఫొటోలను ధోనీ అర్ధాంగి సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ కొత్త సభ్యురాలి పేరు హనీ. అదొక మకావు చిలుక. కంటికి ఇంపైన రంగుల్లో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ మకావు చిలుక ధోనీ భుజంపై ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. ధోనీ టీ తాగుతుండగా, అది భుజంపై నింపాదిగా కూర్చుకుంది.
దీనిపై సాక్షి సింగ్ స్పందిస్తూ "మహీ మరియు అతడి హనీ" అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు, ఆ ఫొటోకు "చాయ్ డేట్స్" అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఈ కూల్ పిక్ ధోనీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.