TRSLP: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ

TRSLP will meet on tomorrow
షార్ట్స్‌లో చూడండి
ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ అంశాన్ని కూడా రేపటి భేటీలో చర్చించనుంది.

ఈ కీలక సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తమ్మీద ధాన్యం అంశంలో కేంద్రాన్ని, బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్ కార్యాచరణను రేపటి సమావేశంలో ఖరారు చేయనున్నారు.
Go Back to Shorts
TRSLP
CM KCR
Meeting
Hyderabad
TRS
BJP
Telangana

More Telugu News