'20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య' కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.. విడుదలకు సిద్ధం

'20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య' కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.. విడుదలకు సిద్ధం

Savitri wife of satyamurthy release date
  • ప్రధాన పాత్రలను పోషించిన శ్రీలక్ష్మి, పార్వతీశం
  • ఈ నెల 19న థియేటర్లలో విడుదల
  • కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించిన చిత్రం
20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా?. వినడానికే చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంది కదూ? ఇదే కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా వస్తోంది. ఈ చిత్రంలో 60 ఏళ్ల సావిత్రి పాత్రను సీనియర్ నటి శ్రీలక్ష్మి పోషించగా, 20 ఏళ్ల కుర్రాడి పాత్రలో పార్వతీశం నటించాడు.

40 ఏళ్ల తేడా ఉన్న వీరిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారనే విషయం తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే. 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మించారు.
Savitri Wife of Satyamurthy
Tollywood
Release Date
20 years husband
60 years wife

More Telugu News