JC Prabhakar Reddy: పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా హత్తుకున్న జేపీ ప్రభాకర్ రెడ్డి.. వీడియో ఇదిగో!

JC Prabhakar Reddy hugs Parital Sriram
షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా టీడీపీలో ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. జిల్లాలో పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం మధ్య ఒకప్పుడు వైరం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. ఈరోజు టీడీపీ నేత నారా లోకేశ్ అనంతపురంలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ ను స్వాగతించేందుకు జేపీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ ను ప్రభాకర్ రెడ్డి ప్రేమగా హత్తుకున్నారు. ఈ సన్నివేశంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
JC Prabhakar Reddy
Paritala Sriram
Nara Lokesh
Telugudesam

More Telugu News