Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Shruti Hassan joins Balakrishna movie
షార్ట్స్‌లో చూడండి
*  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుందంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే శ్రుతిహాసన్ ఎంపికను ఖరారు చేస్తూ, ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం దీపావళి రోజున ఒక పోస్టర్ వదిలింది. బాలకృష్ణతో శ్రుతి నటించడం ఇది తొలిసారి కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించడం మాత్రం మూడోసారి అవుతుంది. గతంలో ఆయనతో 'బలుపు, 'క్రాక్' సినిమాలు చేసింది.
*  నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక కథానాయిక సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టి, పలు కొత్త ప్రాజక్టులను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా తన పారితోషికాన్ని బాగా పెంచినట్టు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి ఆమె సుమారు 3 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
*  ఆది సాయికుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్లాక్' చిత్రం నిర్మాణం పూర్తయింది. దీంతో చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టుగా పేర్కొంటూ చిత్ర నిర్మాతలు తాజగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దర్శన బానిక్ ఇందులో కథానాయికగా నటించింది.
Go Back to Shorts
Shruti Hassan
Balakrishna
Samantha
Aadi Saikumar

More Telugu News