కేటీఆర్ మెడలో పసుపు కండువా వేసిన డీఎంకే ఎంపీలు!
- నీట్ రద్దు కోరుతున్న తమిళనాడు ప్రభుత్వం
- మద్దతు కూడగడుతున్న సీఎం స్టాలిన్
- తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ
- లేఖను మంత్రి కేటీఆర్ కు అందజేసిన డీఎంకే ఎంపీలు
ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన లేఖతో డీఎంకే ఎంపీలు వీరస్వామి, ఎల్ఎం గోవింద్ నేడు తెలంగాణ భవన్ కు విచ్చేశారు. అక్కడున్న మంత్రి కేటీఆర్ ను కలిసి లేఖ అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు కేటీఆర్ మెడలో పసుపు కండువా వేశారు. డీఎంకే పార్టీ కండువా కూడా పసుపు రంగులోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.