'ఆచార్య' నుంచి అధికారిక ప్రకటన వచ్చేస్తోందట!

Acharya movie update
  • నిర్మాణానంతర పనుల్లో 'ఆచార్య'
  • అందరిలో ఆసక్తిని రేపుతున్న రిలీజ్ డేట్
  • డిసెంబర్ 17న ఖాయమంటూ టాక్
  • త్వరలో రానున్న అధికారిక ప్రకటన
కొరటాలకి ఇంతవరకూ అపజయమనేది తెలియదు. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు భారీ విజయాలను సాధించాయి. వినోదంతో కూడిన సందేశాన్ని అందించడం .. అలరించడం ఆయన ప్రత్యేకత. చిరంజీవి కథానాయకుడిగా .. చరణ్ ప్రత్యేక పాత్రధారిగా రూపొందిన 'ఆచార్య' కూడా అదే తరహాలో కొనసాగనుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అదే రోజున 'పుష్ప' థియేటర్లకు రానుండటంతో, అందరిలో సందేహాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన రావడం ఖరారైపోయిందనీ, ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారని అంటున్నారు. కాజల్ .. పూజ హెగ్డే కథానాయికలుగా సందడి చేయనున్న ఈ సినిమాకి, మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Kajal Agarwal
Ramcharan
Pooja Hegde

More Telugu News