Advertisement

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం: కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం!

Vizag Steel Plant another accident Contract worker dies tragically
  • కోక్ ఓవెన్ విభాగంలో ప్రమాదం
  • భారీ ఐరన్ బార్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందిన కార్మికుడు
  • నెల రోజుల క్రితమే ప్లాంట్‌లో భారీ ప్రమాదం

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ప్లాంట్‌లోని 'కోక్ ఓవెన్' విభాగంలో చోటుచేసుకున్న ప్రమాదంలో అనంత బార్వే అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విధులు నిర్వహిస్తుండగా ఊహించని విధంగా భారీ ఐరన్ బార్ ఆయనపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.


నెల రోజుల క్రితమే ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది కార్మికులు దుర్మరణం పాలైన విషాదం నుంచి తేరుకోకముందే, మళ్లీ ఇలాంటి ఘోరం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ప్రమాదంలో హాట్ మెటల్ ఒకేసారి విరుచుకుపడి అగ్నిగోళంలా బద్దలవడంతో కార్మికులు సజీవదహనమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా నిలిచిన ఆ ఘటనపై ఇప్పటికే కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్‌లో పనిచేసే వేలాది మంది కార్మికులకు కనీస ప్రాణ రక్షణ కల్పించాలని, భద్రతా ప్రమాణాలను తక్షణమే పునఃసమీక్షించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Vizag Steel Plant
Ananth worker death
Coke Oven accident
Visakhapatnam industrial mishap
Vizag Steel Plant safety issues
Contract worker death Vizag

More Telugu News