బాలుడ్ని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష
- హైదరాబాదులో ఘటన
- పాతబస్తీలో ఓ స్కూల్లో చదువుతున్న బాలుడు
- 9 ఏళ్ల బాలుడిపై పాతికేళ్ల ఆయా లైంగిక వేధింపులు
- 2017లో కేసు నమోదు
- తీర్పు వెలువరించిన బాలమిత్ర కోర్టు
దీనిపై 2017లో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితురాలిపై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన పోలీసులు, సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసును విచారించిన బాలమిత్ర కోర్టు ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.