'ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి' చేప‌ట్టిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ నుంచి మ‌రో 78 మంది త‌ర‌లింపు.. వీడియో ఇదిగో

'ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి' చేప‌ట్టిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ నుంచి మ‌రో 78 మంది త‌ర‌లింపు.. వీడియో ఇదిగో

India operation of evacuation from Afghanistan called Operation Devi Shakti
  • ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోతోన్న‌ తాలిబ‌న్లు
  • భార‌త్ వ‌స్తోన్న 78 మందిలో 25 మంది భార‌తీయులు
  • దుషన్బే మీదుగా తీసుకొస్తున్న అధికారులు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు రెచ్చిపోతుండ‌డంతో ఆ దేశ రాజ‌ధాని కాబూల్ లోని విమానాశ్ర‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు భార‌త్ చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ దేవి శ‌క్తిగా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు.

ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

కాగా, దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. మరోపక్క, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌సిద్ధ గ‌జిని ప్రావిన్స్ గేటును తాలిబ‌న్లు కూల్చివేశారు. ఇందుకు స‌బంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.
Afghanistan
India
Operation Devi Shakti

More Telugu News