సినీ నటి హేమకు ఊరట.. హెచ్చరించి వదిలేసిన ‘మా’
- ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై విరుచుకుపడిన హేమ
- నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణ
- తొలి తప్పిదంగా హెచ్చరించి వదిలేసిన డీఆర్‌సీ
హేమ ఆడియో కలకలం రేపడంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవితా రాజశేఖర్ క్రమశిక్షణ సంఘానికి (డీఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు నోటీసులు జారీ చేసిన డీఆర్‌సీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని హేమను కోరింది. హేమ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన డీఆర్‌సీ మొదటి తప్పుగా హెచ్చరించి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండానే వదిలిపెట్టింది. మరోసారి ఇలా జరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.