ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు బాలికలతో శారీరక సంబంధం పెట్టుకున్న బాలుడు.. కేసు నమోదు
Add ap7am to your home Screen

ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు బాలికలతో శారీరక సంబంధం పెట్టుకున్న బాలుడు.. కేసు నమోదు

boy love affair with three girl in mahabubabad dist
  • తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • మూడో బాలిక నేరుగా బాలుడి ఇంటికి రావడంతో వెలుగులోకి బాగోతం
  • పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ బాలుడు ముగ్గురు బాలికలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి ఆపై మోసం చేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు పొరుగూరికి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో కొన్ని డబ్బులిచ్చి ఆమెతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు.

ఆ తర్వాత 14 ఏళ్ల మరో బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగక 17 ఏళ్ల ఇంకో బాలికను పెళ్లాడతానంటూ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే, బాలుడిని అనుమానించిన బాలిక నేరుగా అతడి ఇంటికి రావడంతో అతడి బాగోతం బయటపడింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Mahabubabad District
Love

More Telugu News