ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి.. ట్రాఫిక్ జామ్!
- పదిహేను అడుగుల గొయ్యి
- గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు
- వాహనాల దారి మళ్లింపు
భారీ గొయ్యి పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఐఐటీ నుంచి అధ్చినికి వెళ్లే వాహనాలను కత్వారియా సరాయి గుండా దారి మళ్లించామని, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి ఆ మార్గంలో వెళ్లొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
కాగా, దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతుతో ఆ గొయ్యి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రజాపనుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.