రొమాంటిక్ హీరోగా కార్తికేయ కొత్త ప్రాజెక్ట్!
- కార్తికేయ తాజా చిత్రంగా 'రాజా విక్రమార్క'
- కథానాయికగా తాన్య రవిచంద్రన్
- కొత్త దర్శకుడితో మరో సినిమా
- రుహాని శర్మకు ఛాన్స్
యూవీ క్రియేషన్స్ వారు భారీ సినిమాలు తీస్తూ వస్తున్నారు. దానికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ ను ఏర్పాటు చేసుకుని ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలా ఇటీవల వచ్చిన 'ఏక్ మినీ కథ' సక్సెస్ అయింది. దాంతో వాళ్లు మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్నారు. కార్తికేయ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. కార్తికేయ జోడీగా 'రుహాని శర్మ'ను తీసుకున్నారట. 'డర్టీ హరి'తో యూత్ ను ఆకట్టుకున్న ఈ అమ్మాయి, అవసరాల సరసన కూడా '101 జిల్లాల అందగాడు' చేస్తోంది. కార్తికేయ కొత్త ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.