Akhanda: నేటి నుంచి బాలకృష్ణ 'అఖండ' తుది షెడ్యూల్

  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ
  • ఆఖరి షెడ్యూల్ లో ప్రవేశం
  • నేడు హైదరాబాద్ షూటింగ్ ప్రారంభం
  • అఘోరాగా నటిస్తున్న బాలయ్య
Balakrishna Akhanda enters into final schedule

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ' ఆఖరి షెడ్యూల్ లో ప్రవేశించింది. నేడు హైదరాబాదులో ఈ చిత్రం తుది షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. హీరో బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. బాలయ్య ఇందులో అఘోరాగా కనిపించే ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అఖండ' చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News