సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- లావణ్య చేతిలో భారీ ఎండార్స్ మెంట్
- పవన్ ఇంట్రో సీన్ చిత్రీకరణకు ఏర్పాట్లు
- వరుణ్ తేజ్ కి భారీ బాలీవుడ్ ఆఫర్
* మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూలును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పవన్ కల్యాణ్ పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. సినిమాలో ఇది పవన్ ఇంట్రడక్షన్ సీన్ అని తెలుస్తోంది.
* మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో బాలీవుడ్ ప్రవేశం చేయనున్నట్టుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ హిందీలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని, ప్రస్తుతం వరుణ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.