ఇందిరాగాంధీ పాత్రలో కంగన రనౌత్
- ఇప్పటికే జయలలిత బయోపిక్ లో నటించిన కంగన
- ఇందిర పాత్రను పోషించబోతున్నానని ప్రకటన
- ఎమర్జెన్సీ కాలంనాటి పరిణామాల ఆధారంగా సినిమా
అయితే, ఆ చిత్రం ఇందిరాగాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగన వెల్లడించింది. ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని కంగన నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.