యాంకర్‌ ప్రదీప్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే స‌రైన‌ బుద్ధి చెబుతాం: ఏపీ పరిరక్షణ సమితి

pradeep lands in new controversy
  • మ‌రో వివాదంలో ప్ర‌దీప్
  • ఓ టీవీ షోలో 'ఏపీ రాజధాని విశాఖ' అంటూ వ్యాఖ్య‌లు
  • మండిప‌డ్డ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పరిరక్షణ సమితి
  • ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ‌రిక
టీవీ యాంకర్‌ ప్రదీప్ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న ఓ టీవీ షోలో 'ఏపీ రాజధాని విశాఖ' అంటూ వ్యాఖ్య‌లు చేశార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల‌ని, అలాగే క్షమాపణలు చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. లేదంటే హైదరాబాద్‌లోని ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ‌రించింది.

రాజ‌ధాని అంశం కోర్టు పరిధిలో ఉన్న స‌మ‌యంలో ఆయా అంశాలపై  ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు నిల‌దీశారు. ఏపీ అన్న‌దాత‌ల‌తో పాటు రాష్ట్ర‌ ప్రజల మనోభావాలను కించపర్చేలా వ్యాఖ్య‌లు చేస్తే స‌రైన‌ బుద్ధి చెబుతామన్నారు. గ‌తంలోనూ యాంక‌ర్ ప్ర‌దీప్ ప‌లు వివాదాల్లో ఇరుక్కుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
pradeep
tv
Amaravati

More Telugu News