ప్రముఖ సినీ విశ్లేషకుడిపై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా... అసలు కారణం ఇదే!

Salman Khan sends notice to Kamaal R Khan
  • ఇటీవలే విడుదలై రాధే
  • నెగెటివ్ రివ్యూ ఇచ్చిన కమాల్ ఆర్ ఖాన్
  • న్యాయపరమైన చర్యలు తీసుకున్న సల్మాన్
  • కమాల్ కు నోటీసులు పంపిన సల్మాన్ లాయర్
  • నోటీసులు ఎందుకు పంపారో వివరణ ఇచ్చిన వైనం
సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'రాధే' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాపై ప్రముఖ విశ్లేషకుడు, రివ్యూ రైటర్ కమాల్ ఆర్ ఖాన్ రాసిన సమీక్ష సల్మాన్ అభిమానుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని అందరూ భావిస్తున్నారు.

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్... కమాల్ ఆర్ ఖాన్ పై పరువునష్టం దావా వేయడంతో, తన చిత్రంపై నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకే సల్మాన్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ, అసలు విషయం అది కాదని సల్మాన్ ఖాన్ న్యాయవాది వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ అవినీతిపరుడు అని, బీయింగ్ హ్యూమన్ ముసుగులో అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కమాల్ ఆర్ ఖాన్ ప్రచారం చేస్తున్నాడని వివరించారు. సల్మాన్ ఖాన్ అవకతవకలకు పాల్పడడమే కాదు మనీలాండరింగ్ కూడా చేస్తున్నాడని, సల్మాన్ ఖాన్ ఓ దోపిడీదారుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడని న్యాయవాది తెలిపారు. గత కొన్నినెలలుగా కమాల్ ఆర్ ఖాన్ ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అందరి దృష్టిని ఆకర్షించడమే అతడి ప్రయత్నాల వెనుకున్న ఉద్దేశమని తెలిపారు.

అయితే, ఈ పరిణామాలపై స్పందించిన కమాల్ ఆర్ ఖాన్... సల్మాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తాను భారత్ లో ఉండే వ్యక్తిని కానని, అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ కెరీర్ ను ఏ విధంగా నాశనం చేస్తానని వ్యాఖ్యానించారు. తాను సరదా కోసమే సినిమాలపై రివ్యూలు వెలువరిస్తుంటానని, ఒకవేళ సల్మాన్ ఖాన్ కు నచ్చకపోతే అతడి చిత్రాలపై రివ్యూలు ఇవ్వడం మానేస్తానని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Salman Khan
Kamaal R Khan
Defamation Suit
Radhe
Review
Bollywood

More Telugu News