కరోనా రోగులకు చికిత్స పూర్తైనా డిశ్చార్జ్ చేయని ఆసుపత్రులకు ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీసులు
- చికిత్స పూర్తైనా 10 నుంచి 14 రోజులు ఉంచుకుంటున్న ఆసుపత్రులు
- ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అందిన పలు ఫిర్యాదులు
- చికిత్స పూర్తైన వారిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశాలు
వాస్తవానికి రోజు వారీ ట్రీట్మెంట్ విధానంలో ఆసుపత్రులకు చెల్లింపులు జరపాల్సిందిగా ఆరోగ్యశ్రీ టెక్నికల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే, కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో... ఆరోగ్యశ్రీ చర్యలకు ఉపక్రమించింది. కరోనా నుంచి కోలుకున్న రోగులను తక్షణమే డిశ్చార్జ్ చేయాలని నోటీసుల్లో ఆదేశించింది.