'దృశ్యం 2'పై వచ్చింది పుకారేనని తేల్చిన సురేశ్ బాబు!
- మలయాళంలో హిట్ కొట్టిన 'దృశ్యం 2'
- తెలుగు కోసం రంగంలోకి దిగిన జీతూ జోసెఫ్
- రెండు నెలలలోపే రీమేక్ షూటింగు పూర్తి
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనేది ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి లేదు కనుక, ఈ సినిమాను ఓటీటీలో రీలీజ్ చేయనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తాము స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.