వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప‌దేళ్లు.. జ‌గ‌న్ స్పంద‌న‌

jagan tweets about ycp
  • మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ
  • విలువలు, విశ్వసనీయతల పునాదులపై ఏర్పాటు
  • ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచారు
  • ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి ప‌దేళ్లు నిండాయి. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  జ‌రుపుకుంటున్నారు. 11వ వ‌సంతంలోకి అడుగుపెడుతోన్న వైసీపీ ప్ర‌స్థానాన్ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 'మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని జ‌గ‌న్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News