పూజ హెగ్డే బామ్మ మృతి.. హీరోయిన్ భావోద్వేగభరిత ట్వీట్!
- ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఉండాలని నేర్పింది
- ధైర్యంగా ఉండాలని , ఇగోను పక్కనబెట్టాలని చెప్పేది
- ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది
ధైర్యంగా ఉండడాన్ని, ఇగోను పక్కనబెట్టి కావాల్సిన వారితో కలిసిమెలసి ఉండడాన్ని తన బామ్మ నేర్పించిందని తెలిపింది. ఆమె ఎప్పుడు తనతోనే ఉంటుందని, లవ్ యూ ఆజీ అని పేర్కొంది. తాను సినిమా షూటింగుల్లో ఉన్న సమయంలో తనకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగేదని చెప్పింది. ఇప్పుడు తాను ఆమె ఫోన్ కాల్స్ ను మిస్ అవుతున్నట్లు తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నట్లు తెలుపుతూ తన బామ్మతో గతంలో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.