సీఎం విజయ్‌పై నాని ప్రశంసలు.. ‘పాన్ ఇండియా’ ట్యాగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
- విజయ్‌కి ప్రజల్లో ఉన్నది కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదన్న నాని
- తమిళ ప్రజలు విజయ్‌ను తమ ఇంటి సభ్యుడిగా చూస్తారని ప్రశంస
- ఆయన పాలన గొప్పగా సాగాలని ఆకాంక్ష
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రయాణంపై స్పందించిన నాని... విజయ్‌కి ప్రజల్లో ఉన్నది కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదని, దశాబ్ద కాలంగా ఆయన సంపాదించుకున్న ప్రజల నమ్మకమని కొనియాడారు. తమిళనాడు ప్రజలు విజయ్‌ను తమ ఇంటి సభ్యుడిగా భావిస్తారని, శాసనసభలో ఆయన మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చూశానని, అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. రాబోయే కాలంలో కూడా ఆయన పరిపాలన ఇలాగే కొనసాగాలని, ప్రజల నమ్మకం నిజం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సమావేశంలో ‘పాన్ ఇండియా’ బిరుదుపై నాని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక హిందీ సినిమా ఘనవిజయం సాధిస్తే దానిని సాధారణంగా ‘హిందీ సినిమా’ అని మాత్రమే పిలుస్తారని, అదే దక్షిణాది సినిమాలు విజయం సాధిస్తే మాత్రం ‘పాన్ ఇండియా సినిమా’ అనే ప్రత్యేక లేబుల్ వేయడం తనకు నచ్చదని స్పష్టం చేశారు. తన చిత్రాలను కూడా అలా పిలవద్దని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.