Andhra Pradesh: ఏపీ కరోనా తాజా వివరాలు: రాష్ట్రంలో 62 కొత్త కేసులు

Sixty two corona positive cases emerges in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గత 24 గంటల్లో 22,094 కరోనా టెస్టులు నిర్వహించగా 62 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 10 కొత్త కేసులు వెలుగు చూశాయి. కడప జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖ జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,485 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,80,363 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 962కి తగ్గింది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,160కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News