ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్!

Bollywood star to shake a leg with Prabhas
  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్'   
  • ప్రస్తుతం గోదావరి ఖనిలో షూటింగ్
  • సినిమాలో మాస్ మాసాల ఐటమ్ సాంగు
  • ప్రియాంక చోప్రా కోసం ప్రయత్నాలు  
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై వున్నాయి. వీటిలో ఒకటి 'సలార్' కాగా, మరొకటి 'ఆదిపురుష్'. కన్నడ దర్శకుడు, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'సలార్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా తెలంగాణలోని గోదావరిఖని ఓపెన్ కాస్ట్ ఏరియాలో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.

ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన ఒక విశేషం ప్రచారంలో వుంది. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటం సాంగు ఉందట. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి గాను బాలీవుడ్ భామ, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె కుదరని పక్షంలో మరో బాలీవుడ్ నటి దీపిక పదుకొణే నైనా తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది.
Priyanka Chopra
Prabhas
Prashanth Neel

More Telugu News