Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

185 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 197 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,91,312 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,604కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2008 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 730 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 27 కరోనా కేసులు నమోదయ్యాయి.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News