నా సినీ కెరీర్‌లో ఇది అతిపెద్ద అడుగు: ప‌్ర‌దీప్ మాచిరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినీ కెరీర్‌లో ఇది అతిపెద్ద అడుగు: ప‌్ర‌దీప్ మాచిరాజు

pradeep emotional tweet
  • నిన్న‌ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ విడుద‌ల‌
  • నిన్న ఒక్క‌రోజే రూ.4 కోట్ల గ్రాస్‌
  • తొలి సినిమాకు గొప్ప‌ ఆదరణ లభించడం ప‌ట్ల హ‌ర్షం
  • ప్రేక్ష‌కులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాన‌ని ట్వీట్
యాంక‌ర్ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా న‌టించిన‌ తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నిన్న విడుద‌లైంది. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల కొన్ని నెల‌ల పాటు వాయిదా ప‌డి, చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్ని నెల‌లూ ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..' అనే పాట ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఆ సినిమాపై అంచ‌నాలు తెచ్చిపెట్టింది. ఈ పాట ఎంత బాగుందో ఈ సినిమా కూడా అంత బాగుంద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారంటూ ఈ సినిమా యూనిట్ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌కూ మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో నిన్న ఒక్క‌రోజే రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించింది. దీంతో ప్ర‌దీప్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్లు చేశాడు. హీరోగా తన తొలి సినిమాకు గొప్ప‌ ఆదరణ లభించడం ప‌ట్ల  ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. చిన్న సినిమాకి విశేష స్పందన ల‌భించింద‌ని తెలిపాడు.  

ఇది త‌న‌ ఎన్నో రోజుల కల అని చెప్పాడు. ప్రేక్ష‌కులంద‌రి సహకారంతోనే ఈ రోజు అది సాధ్యం అయిందని, త‌న సినీ కెరీర్‌లో అతిపెద్ద అడుగు ఇద‌ని చెప్పాడు. తాను ఈ అడుగు వేసే స‌మ‌యంలో ఇంతమంది మ‌ద్ద‌తుగా ఉండ‌డం అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని చెప్పాడు.

క‌రోనా నేప‌థ్యంలోనూ ఇంతమంది ప్రజలు థియేటర్స్‌కి రావడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.  తాను ఎల్ల‌ప్పుడే ప్రేక్ష‌కులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాన‌ని చెప్పాడు. కాగా, ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది.  
pradeep
30 Rojullo Preminchadam Ela
Tollywood

More Telugu News