’టి’ అనే పదమే కేసీఆర్ భిక్ష.. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి: కేటీఆర్
- మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది
- కేసీఆర్ లేకుంటే మీకు పదవులెక్కడివి?
- నోరు అదుపులో పెట్టుకోండి
అసలు ‘టి’ అనేదే కేసీఆర్ పెట్టిన భిక్ష అన్న సంగతిని గుర్తెరగాలన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయి ఉంటే టీపీసీసీ, టీబీజేపీ పదవులెక్కడివని ప్రశ్నించారు. వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర సాధనకు ఉద్యమం చేసినట్టుగానే, ప్రతిపక్షాల కుట్రలను కూడా తిప్పికొట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు.