పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' నుంచి ఈ అర్ధరాత్రి కీలక అప్ డేట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' నుంచి ఈ అర్ధరాత్రి కీలక అప్ డేట్

Midnight update from Pawan Kalyan Vakeel Saab
  • శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవన్ వకీల్ సాబ్
  • షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం
  • నూతన సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్ కు కానుక
  • టీజర్ రిలీజ్ చేసే అవకాశం
  • రిలీజ్ డేట్ ప్రకటిస్తారంటూ ప్రచారం
పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ అర్ధరాత్రి వకీల్ సాబ్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ రానుందని చిత్రబృందం వెల్లడించింది. నూతన సంవత్సర ఘడియల్లో వకీల్ సాబ్ నుంచి ఫ్యాన్స్ కు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

పవన్ కొత్త చిత్రం నుంచి టీజర్ వస్తుందని అభిమానులు గత దసరా, దీపావళి నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను సంతోషసాగరంలో ముంచెత్తే విధంగా ఈ అర్ధరాత్రి వకీల్ సాబ్ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 9?) కూడా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య కీలకపాత్రలు పోషించారు.
Vakeel Saab
Update
Midnight
New Year
Pawan Kalyan
Sriram Venu
Tollywood

More Telugu News