టీకాకు సన్నద్ధం... నేడు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్!

Vaccine Dry Run Today in Three States
  • నేడో, రేపో టీకాకు అనుమతి
  • ఏపీ, గుజరాత్, పంజాబ్, అసోంలో నేడు డ్రై రన్
  • లోపాలను పరిశీలించనున్న అధికారులు
నేడో, రేపో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో, నేడు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ జరుగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇండియా సిద్ధమవుతున్న వేళ, నేడు అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు డ్రై రన్ జరుగనుంది. ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి వ్యాధి నిరోధకతను పెంచేలా టీకా వేసే క్రమంలో వచ్చే సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది.

ఇందులో భాగంగా, ప్రతి జిల్లాల్లో డమ్మీ టీకాలను 100 మందికి ఇవ్వనున్నారు. డిపోల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రానికి టీకాను తెచ్చి, ఇచ్చిన తరువాత, ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, వెంటనే ఎలా స్పందించాలి? ఏం చేయాలన్న విషయమై ట్రయల్స్ వేయనున్నారు.

టీకాను తీసుకోవాలంటే ఏం చేయాలన్న విషయంపై కూడా ఈ రెండు రోజుల్లో అధికారులు ఓ నిర్ణయానికి రానున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి పేరు, చిరునామా, టీకా ఇచ్చిన అధికారి పేరు, తీసుకున్న సమయం తదితరాలను రికార్డు చేస్తారు. టీకా తీసుకున్న తరువాత అక్కడే 30 నిమిషాలు ఉండాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ అరగంటలో ఎటువంటి దుష్ప్రభావాలు కలుగకుంటేనే పంపుతారు.

ఏవైనా సైడ్ ఎఫెక్ట్ లు వస్తే వెంటనే సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్రానికి పంపడంతో పాటు, సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ, రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ లా నాలుగు రాష్ట్రాల్లో సాగనుంది. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
Corona Virus
Vaccine
Dry Run
Andhra Pradesh

More Telugu News