ఆసుపత్రిలో ఉండేందుకు వరవరరావుకు హైకోర్టు అనుమతి
- ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్
- జైలులో ఉండగా క్షీణించిన ఆరోగ్యం
- కోర్టు జోక్యంతో ఆసుపత్రికి
- ఆరోగ్యం మెరుగుపడిందన్న వరవరరావు తరపు న్యాయవాది
జనవరి ఏడో తేదీ వరకు నానావతి ఆసుపత్రిలో ఉండేందుకు వరవరరావుకు అనుమతిచ్చిన ధర్మాసనం.. బెయిలు పిటిషన్‌ను మాత్రం వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అలాగే, వరవరరావుకు ఆరోగ్యానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా, వరవరరావు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు.