నా హీరో ఇక లేరు: గంగూలీ భావోద్వేగ వ్యాఖ్యలు
- గుండెపోటుతో డీగో మారడోనా హఠాన్మరణం
- మారడోనా కోసమే ఫుట్ బాల్ చూశానన్న గంగూలీ
- ప్రపంచం గొప్ప ఆటగాడిని కోల్పోయిందన్న సచిన్
"నా హీరో ఇక లేరు. ఆ అద్భుతమైన ఆటగాడి ఆత్మకు శాంతి కలగాలి. మీ కోసం మాత్రమే నేను ఫుట్ బాల్ చూశాను" అని ట్వీట్ చేశారు. ఈనెల ప్రారంభంలో బ్రెయిన్ సర్జరీ తరువాత కాస్తంత కోలుకున్నప్పటికీ, ఆపై పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
మారడోనా మృతిపై సచిన్ టెండూల్కర్ సైతం స్పందించారు. "ఫుట్ బాల్ ప్రపంచం ఓ గొప్ప ఆటగాడిని కోల్పోయింది. డీగో మారడోనా ఆత్మకు శాంతి కలగాలి. మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం" అని వ్యాఖ్యానించారు. ఈ వార్త తనను కలచి వేసిందని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.