నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: శిల్పా రవికి అఖిలప్రియ సవాల్
- ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు
- హత్యతో భూమా కుటుంబానికి సంబంధం ఉందన్న ఎమ్మెల్యే శిల్పా రవి
- నోరు అదుపులో పెట్టుకోవాలన్న అఖిలప్రియ
హత్యతో తమ కుటుంబానికి సంబంధం ఉందనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని శిల్పా రవికి సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నంద్యాల నియోజకవర్గంలో ఏది జరిగినా భూమా కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిల్పా రవి పుట్టక ముందే భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. తన తండ్రి మీద కూడా కేసులు పెట్టి హింసించారని దుయ్యబట్టారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు.