మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారు?: సుప్రీంకోర్టు
- ప్రజా రక్షణ చట్టం కింద గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ
- తల్లిని కలిసేందుకు అనుమతించాలని ఆమె కుమార్తె పిటిషన్
- వారం రోజులు గడువు కోరిన సొలిసిటర్ జనరల్
ముఫ్తీని ఇంకెంత కాలం నిర్బంధిస్తారంటూ ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులుగా వారం రోజుల్లో వివరణ ఇస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రజా రక్షణ చట్టం కింద ముఫ్తీతో పాటు పలువురు నేతలను గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను రెండు నెలల క్రితమే విడుదల చేశారు.