పూజ హెగ్డే ఆ లక్కీ ఛాన్స్ కొట్టినట్టేనా!

Pooja Hegde plays double roles
సాధారణంగా డబుల్ రోల్స్ చేసే అవకాశం హీరోలకు వస్తుంటుంది కానీ హీరోయిన్ లకు మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన అవకాశం ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న పూజ హెగ్డేకు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రం రూపొందుతోంది. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు చెబుతున్నారు.

పిరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజ కవలలుగా డబుల్ రోల్స్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పాత్ర అయితే పూర్తిగా సంప్రదాయబద్ధంగా క్లాసిక్ గా వుంటుందట. మరో పాత్ర ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ పూజ ద్విపాత్రాభినయం చేయడం నిజమే అయితే కనుక, నేటి తరం కథానాయికలలో ఆమె చాలా లక్కీ అనే చెప్పచ్చు.

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, లాక్ డౌన్ కి ముందు కొంత భాగం షూటింగ్ జార్జియాలో నిర్వహించారు. కథ ప్రకారం మళ్లీ యూరప్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కష్టం కాబట్టి, ఆ షూటింగును కూడా హైదరాబాదులోనే సెట్స్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.  
Go Back to Shorts
Pooja Hegde
Prabhas
Radha Krishna Kumar
Radhe Shyam

More Telugu News