Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 'హైకోర్టు ఉత్తర్వులపై స్టే'కు నిరాకరణ!

supreme court rejects ap govt pitition
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన 81, 85 జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.

విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధననే కోరుతున్నారని ఏపీ సర్కారు వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Go Back to Shorts
Supreme Court
Andhra Pradesh
YSRCP

More Telugu News